జనవరి 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. రాజధానిపై జరగనున్న చర్చ
BY TV5 Telugu11 Jan 2020 12:24 PM GMT

X
TV5 Telugu11 Jan 2020 12:24 PM GMT
ఈనెల 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. రాజధానిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జీఎన్‌రావు రిపోర్ట్, బోస్టన్ రిపోర్ట్, హైపవర్ కమిటీ నివేదికలపై చర్చించనున్నట్లు సమాచారం. అభివృద్ధి వికేంద్రీకరణ పైనా చర్చిద్దామని ప్రభుత్వం చెబుతోంది. పాలనా రాజధాని విశాఖకు తరలించాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చిన సర్కార్.. ఈ దిశగానే అడుగులు వేస్తున్న నేపథ్యంలో సంక్రాంతి తర్వాత జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.
Next Story