20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నోటిఫికేషన్ జారీ

20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నోటిఫికేషన్ జారీ

ASSEMBLU

ఈ నెల 20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. మూడు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. రాజధాని అంశంతోపాట పలు కీలక బిల్లులపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది. రాజధాని తరలింపుపై దాదాపు నెలరోజులుగా అమరావతి అట్టుడుకుతోంది. విపక్షాలు కూడా ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని అంశంపైనే వాడివేడి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. అటు ప్రభుత్వం కూడా విపక్షాల ఆరోపణలు తిప్పికొట్టి.. రాజధాని రైతులకు క్లారిటీ ఇవ్వాలని భావిస్తునట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story