ఆంధ్రప్రదేశ్

ప్రజల మద్దతు కూడగట్టి పోరాటాన్ని ఉదృతం చేస్తున్న చంద్రబాబు

ప్రజల మద్దతు కూడగట్టి పోరాటాన్ని ఉదృతం చేస్తున్న చంద్రబాబు
X

abbau

అమరావతి రాజధాని కోసం టీడీపీ అధినేత చంద్రబాబు పోరాటాన్ని ఉధృతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ప్రజల మద్దతు కూడగడుతున్నారు. రాజధాని కోసం జోలెపట్టి విరాళాలు సేకరిస్తున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితమే అనంతపురానికి చేరుకున్న చంద్రబాబు.. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హిందూపురం, అనంతపురం పార్లమెంట్‌ పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కాసేపట్లో పెనుగొండ వెళ్లనున్న చంద్రబాబు.. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం చెన్నేకొత్తపల్లి, మామిళ్లపల్లి, రాప్తాడు మీదు బళ్లారి బైపాస్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు నగరంలోని క్లాక్‌ టవర్‌ నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. ఆరున్నర గంటలకు నగరంలోని సప్తగిరి సర్కిల్‌లో నిర్వహిస్తున్న బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు.

Next Story

RELATED STORIES