దుండిగల్‌లో దారుణం.. మద్యం తాగించి.. హత్య చేశాడు

దుండిగల్‌లో దారుణం.. మద్యం తాగించి.. హత్య చేశాడు

murder-attempt

హైదరాబాద్‌ శివార్లలోని దుండిగల్‌ పీఎస్‌ పరిధిలో ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశాడో దుండగుడు. మద్యం తాగించి కత్తితో పొడిచి చంపేశాడు. మెదక్‌ జిల్లా పాపన్న పేట మండలానికి చెందిన యాదగౌడ్‌ నగరానికి వలసవచ్చి.. గాగిల్లాపూర్‌లో ఉంటున్నాడు. ఓ ఫైనాన్స్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతనికి DCM డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆసిఫ్‌తో పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో యాదగౌడ్‌ను మద్యం తాగేందుకు తన రూమ్‌కు రమ్మన్నాడు ఆసిఫ్‌. అతన్ని నమ్మి వెళ్లిన యాదగౌడ్‌.. ఆసిఫ్‌తో కలిసి ఫుల్లుగా మద్యం సేవించాడు. ఈ క్రమంలో తన దగ్గరున్న కత్తితో యాదగౌడ్‌పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story