జగన్ ఒక చేతకాని సీఎం.. ఉన్మాది.. : చంద్రబాబు
BY TV5 Telugu18 Jan 2020 9:44 AM GMT

X
TV5 Telugu18 Jan 2020 9:44 AM GMT
పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. అమరావతి కోసం గణపవరంలో జోలె పట్టి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు చంద్రబాబు.. జగన్ చేతకాని సీఎం అని.. ఉన్మాది అంటూ విరుచుకుపడ్డారు. ప్రజా చైతన్యం వస్తేనే అమరావతి తరలింపు ఆగుతుందని అన్నారు. నాడు సమైక్య ఉద్యమం చేసిన ఉద్యోగులంతా ఇప్పుడు ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఈనెల 20న అసెంబ్లీ ముట్టడికి అంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. మేం అసెంబ్లీలో పోరాడుతాం.. మీరు అసెంబ్లీ బయట పోరాడాలని వారికి పిలుపునిచ్చారు. అందరం కలిసి 20న అసెంబ్లీ దిగ్భందిద్దామని.. ఎంత మందిని జైళ్లలో పెడతారో చూద్దామంటూ చంద్రబాబు ఉద్వేగ పూరితంగా మాట్లాడారు.
Next Story