లెవెల్ చేసిన కోహ్లీ సేన

లెవెల్ చేసిన కోహ్లీ సేన

ind-vs-ast

ఫస్ట్ ఓటమికి రివేంజ్ తీర్చుకుంది టీమిండియా. ఆసిస్ తో ఓటమి అవమానంగా ఫీలవ్వాలన్న పాక్ ఆటగాళ్ల హేళన వల్ల కావొచ్చేమోగాని.. టీమిండియా టాపార్డర్ ఆసిస్ కు ఛాన్స్ ఇవ్వకుండా బాదేశారు. శిఖర్ ధవన్, కోహ్లీ, కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. 81 రన్స్ తో ఓపెనింగ్ జోడి గుడ్ స్టార్టింగ్ ఇవ్వటంతో టీమిండియా బిగ్ స్కోరుకు పునాది పడింది. రోహిత్ శర్మ 42 రన్స్ చేయగా శిఖర్ ధవన్ 96 పరుగులు చేశాడు.

రోహిత్ ఔటైన తర్వాత శిఖర్ ధవన్ తో కలిసి కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ తో స్కోరు బోర్డు పెంచారు. ఈ ఇద్దరు సెకండ్ వికెట్ కు 103 రన్స్ చేశారు. దూకుడుగా ఆడిన ధవన్ 96 రన్స్ దగ్గర ఔటై సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించిన కోహ్లీ.. కేరీర్ లో 56వ హాఫ్ సెంచరీ సాధించి 78 రన్స్ దగ్గర ఔటయ్యాడు. మరో ఎండ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ 44 బాల్స్ లోనే 66 రన్స్ చేశాడు. చివర్లో జడ్డూ 11 బాల్స్ లో 16 రన్స్ సాధించాడు. దీంతో టీం స్కోరు 6 వికెట్లకు 340 పరుగులకు చేరింది.

ఆ తర్వాత 341 బిగ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 304 పరుగులకే ఆలౌటైంది. తొలుత ఆసిస్ బ్యాట్స్ మెన్ కాస్త కంగారు పెట్టినా.. కీలక సమయంలో బౌలర్లు వికెట్లు పడగొట్టడంతో ఆసిస్ చేతులేత్తేసింది. అయితే.. స్మిత్, లబుషేన్‌లు క్రీజులో ఉన్నంత సేపూ భారత బౌలర్లను వణికించారు. వాళ్ల ఆటను చూస్తే టార్గెట్ రీచ్ అవుతారేమోననే అనుమానాలు కలిగాయి. అయితే.. 38ఓవర్లో కుల్దీప్ రెండు వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్ టర్న్ తీసుకుంది. స్టీవ్ స్మిత్ 98 పరుగుల దగ్గర ఔటయ్యాడు. ఆ తర్వాత పించ్ 33, లబుషేన్ 46 పరుగులతో రాణించినా.. బిగ్ స్కోరు ముందు నిలవలేకపోయారు. మరో ఐదు బాల్స్ మిగిలి ఉండగానే ఆలౌటయ్యారు.

భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు, సైనీ, జడేజా, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బుమ్రా ఒక వికెట్ తీశాడు. ఈ విక్టరీతో మూడు వన్డేల సీరిస్ 1-1తో సమం అయ్యింది. దీంతో చెన్నైలో జరిగే చివరి మ్యాచ్ సిరీస్ డిసైడర్ కానుంది.

Tags

Read MoreRead Less
Next Story