రాజధాని ఇంచు కూడా కదలదని మరోసారి స్పష్టం చేసిన సుజనాచౌదరి

రాజధాని ఇంచు కూడా కదలదని మరోసారి స్పష్టం చేసిన సుజనాచౌదరి

Sujana-Chowdarys-Tongue-Slip-Corners-TDP

ఆంధ్రప్రదేశ్‌లో రాజధానిపై సీఎం జగన్ తనకు ఇష్టమొచ్చినట్టు చేస్తానంటే.. చూస్తూ ఊరుకోబోమని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. అమరావతి తరలింపుపై కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందని అన్నారాయన. ఆ సమయం ఇంకా రాలేదన్నారు. విభజన చట్టంలో రాజధానిపై చాలా స్పష్టంగా ఉందని సుజనా చౌదరి గుర్తుచేశారు.

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే.. రాష్ట్రం ఆర్థికంగా కుప్పకూలిపోతుందని సుజనా చౌదరి ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకున్నాక.. ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అన్నారాయన. అమరావతిని ఒక్క ఇంచ్‌ కూడా తరలించడం వీలు కాదని మరోసారి స్పష్టంచేశారు.

Tags

Next Story