ప్రభుత్వం టీడీపీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది: చంద్రబాబు

ప్రభుత్వం టీడీపీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది: చంద్రబాబు

BABAU

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై ఏపీ అసెంబ్లీలో చర్చ వాడీవేడిగా సాగింది. అధికార పక్షం తీరుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ సభ్యుల్ని మాట్లాడనివ్వకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు మమ్మల్ని వ్యక్తిగతంగా దూషించడానికే పరిమితమయ్యారన్నారు. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలన్నారు. విభజన చట్టంలో రాజధాని అని మాత్రమే ఉందని.. రాజధానులు అని లేదని గుర్తు చేశారు. శివరామకృష్ణన్‌ కమిటీ కూడా అమరావతి వైపే మొగ్గు చూపిందన్నారు చంద్రబాబు. మూడు రాజధానులపై ప్రభుత్వ విధానం చెబితే బాగుంటుందని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story