సభ నుంచి మధ్యలో వెళ్లిపోయిన స్పీకర్ తమ్మినేని

సభ నుంచి మధ్యలో వెళ్లిపోయిన స్పీకర్ తమ్మినేని

tammineni

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో అరుదైన సన్నివేశం జరిగింది. విపక్ష సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. సభాపతి స్థానం నుంచి వెళ్లిపోయారు. అంతకుముందు.. ఎస్సీ కమిషన్ బిల్లు సభలో చర్చకు వచ్చింది. వైసీపీ సభ్యులు మాట్లాడుతుండగా.. టీడీపీ ఎమ్మెల్యేలు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ వారించినా విన్లేదు. నినాదాలు కొనసాగించారు. దీంతో.. తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తంచేస్తూ.. స్పీకర్ తమ్మినేని సీతారాం తన స్థానం నుంచి వెళ్లిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story