టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్

టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్

speaker

అమరావతిని తరలించొద్దంటూ అసెంబ్లీలో నినదించిన 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. అధికార, విపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి తరలింపును తీవ్రంగా ఖండించారు. బాబు ప్రసంగం తర్వాత.. అమరావతికి అనుకూలంగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.

ఈ నేపథ్యంలో మార్షల్స్ ను పిలిపించి టీడీపీ సభ్యులను బయటికి పంపించాల్సిందిగా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పీకర్ ను కోరారు. దీంతో సస్పెండ్ చేయాల్సిన 17 ఎమ్మెల్యేల పేర్లను ఆర్థిక మంత్రి బుగ్గన చదివి వినిపించారు. ఆ వెంటనే మార్షల్స్ టీడీపీ సభ్యులను బయటికి పంపారు.

Tags

Next Story