రష్యాలో విషాదం.. అగ్నిప్రమాదంలో 11మంది మృతి

X
రష్యాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సైబీరియాలోని ఓ టింబర్ డిపోలో అగ్నిప్రమాదం జరిగి 11 మంది కూలీలు చనిపోయారు. మృతుల్లో 10 మంది ఉజ్బెకిస్తాన్‌కు చెందినవారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
మధ్య ఆసియాకు చెందిన లక్షలమంది వలస కూలీలు రష్యాలో పనులు చేస్తూ జీవిస్తున్నారు. ప్రిచులిమ్స్కై సెటిల్మెంట్లోని ప్రైవేటు టింబర్ డిపోలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు డిపో అంతటికీ వ్యాపించాయి. కూలీలు తేరుకొని బయటికి పరుగెత్తేలోపే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి.. కారకులైనవారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
