చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన అమరావతి రైతులు, మహిళలు

చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన అమరావతి రైతులు, మహిళలు
X

రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్‌ భవన్‌కు పెద్ద ఎత్తున చేరుకున్న రాజధాని గ్రామాల ప్రజలు, మహిళలు జై చంద్రబాబు.. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. గజమాలతో చంద్రబాబును సత్కరించారు. మండలిలో వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి వెళ్లేలా చేసినందుకు అభినందనలు తెలిపారు.

మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మండలిలో ఆయన చేసిన పోరాటానికి అభినందనలు తెలిపారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్సీలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Next Story