ప్రభాస్ మమ్మీగా 'ప్రేమ పావురం' హీరోయిన్
సంగీత ప్రియులకు గుర్తుండిపోయే చిత్రం ప్రేమ పావురాలు. హిందీలో వచ్చిన మైనే ప్యార్ కియాను తెలుగులో ప్రేమ పావురాలు పేరుతో డబ్ చేశారు. ఆ సినిమా ఓ పెద్ద మ్యూజికల్ హిట్. ప్రతి పాటా ఇప్పటికీ అభిమానులకు గుర్తుండిపోయింది. ఓ అందమైన ప్రేమకధ. అందులో నటించిన హీరో, హీరోయిన్లు సల్మాన్ ఖాన్, భాగ్య శ్రీల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుటయ్యింది.
ఇందులో నటించిన ఆ ఇద్దరికీ అదే మొదటి సినిమా. భాగ్య శ్రీ ఆ తరువాత మరి కొన్ని సినిమాల్లో నటించినా ప్రేక్షకులకి మాత్రం ప్రేమ పావురాలే బాగా గుర్తుండిపోతుంది. ఆ తరువాత ఆమె పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. చాలా కాలం తరువాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోంది. అదీ ప్రభాస్‌కు తల్లిగా. రాధాకృష్ణ నిర్మాణంలో ప్రభాస్ నటిస్తున్న జాన్ తెరకెక్కుతోంది. అందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే.
ప్రాముఖ్యం ఉన్న తల్లి పాత్రకు భాగ్య శ్రీని ఒప్పించినట్లు రాధాకృష్ణ చెప్పారు. ఈ సినిమాలో ఆమె పాత్ర హైలెట్ అవుతుందని ఆయన అన్నారు. ఏమైనా.. పాత హీరోయిన్లందరినీ నేటి దర్శకులు తెరపైకి తీసుకువస్తున్నారు. వారిని మరోసారి అభిమానులు తెరపై చూసుకునే భాగ్యాన్ని కల్పిస్తున్నారు. మార్పు హర్షణీయమే.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com