నల్గొండ మున్సిపల్ పీఠాన్ని సొంతం చేసుకున్న టీఆర్ఎస్

నల్గొండ మున్సిపల్ పీఠాన్ని సొంతం చేసుకున్న టీఆర్ఎస్

తీవ్ర ఉత్కంఠ రేపిన నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని చివరికి టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. మొత్తం 48 వార్డుల్లో టీఆర్ఎస్ 20, కాంగ్రెస్ 20, మజ్లిస్ 1, స్వతంత్ర అభ్యర్థి ఒకరు చొప్పున గెలుపొందారు. చైర్మన్ పీఠం దక్కాలంటే 25 మంది సభ్యుల మద్దతు అవసరం. దీంతో మజ్లిస్, స్వతంత్ర అభ్యర్థులను కలుపుకుని.. ఐదుగురు ఎక్స్ అఫిషియో సభ్యుల మద్దతుతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది టీఆర్ఎస్.

ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఓటేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుట్రల్ని తిప్పికొట్టి నల్గొండ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నామని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, చైర్మన్ సైదిరెడ్డి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story