వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్

వైఎస్‌ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్ చేటుచేసుకుంది. ఈ కేసు సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో వివేకా కుమార్తె సునీత పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే కేసు సీబీఐకి ఇవ్వాలంటూ వైఎస్ జగన్, వివేకా భార్య సౌభాగ్యమ్మ, ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పిటిషన్లు వేశారు. తాజాగా సునీత కూడా కేసు వేయడం ఆసక్తికరంగా మారింది. ఆమె తన పిటిషన్‌లో సీబీఐ, ఏపీ హోంశాఖను ప్రతివాదులుగా చేర్చారు. ఐతే.. రాష్ట్ర ప్రభుత్వం CBI విచారణ అవసరం లేదని వాదిస్తోంది. కేసు విచారణ ఓ కొలిక్కి వస్తోందని అంటోంది. ఈ నేపథ్యంలో వివేకా కేసుపై దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కలిపి కోర్టు మంగళవారం విచారించబోతోంది.

Tags

Next Story