ఆంధ్రప్రదేశ్

జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారు: శైలజానాథ్ రెడ్డి

జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారు: శైలజానాథ్ రెడ్డి
X

బీజేపీని ఎదిరించగల ఏకైక శక్తి ఒక్క కాంగ్రెస్‌ పార్టీకే ఉందని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్‌ అన్నారు. జగన్ అక్కడ పౌరసత్వ బిల్లుకు ఓటేసి.. ఇక్కడ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే తాము ఎన్నార్సీకి తాము వ్యతిరేకమని తీర్మానం చేయాలని సవాలు విసిరారు. మండలి రద్దు నిర్ణయాన్ని శైలజానాథ్ తప్పుబట్టారు.

ఇక, పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు గ్రామగ్రామాన పర్యటిస్తామని.. త్వరలోనే జిల్లాల వారీగా రివ్యూలు చేస్తామని శైలజానాథ్‌ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీచేస్తుందని అన్నారు. అయితే, ఇతర పార్టీలతో పొత్తు వుంటుందా..? లేదా..? అన్నది ఇప్పుడే చెప్పలేమని శైలజానాథ్ అన్నారు.

Next Story

RELATED STORIES