ఇంత దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు: వంగవీటి రాధా

ఇంత దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు: వంగవీటి రాధా

ముఖ్యమంత్రి పక్కనే ఉన్నా రాజధాని రైతుల గురించి కనీసం పట్టించుకోవడం లేదని టీడీపీ నేత వంగవీటి రాధా మండిపడ్డారు. మందడంలో అమరావతి జేఏసీ నేతలు చేస్తున్న ఒక్కరోజు దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. వారితోపాటు దీక్షలో కూర్చున్నారు. రాజధాని ఎందుకు మార్చుతున్నారనే దానిపై ప్రభుత్వానికే క్లారిటీ లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టి రాజకీయాలు చేస్తున్నారని ఫైరయ్యారు. ఇంత దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదన్నారు. రైతుల త్యాగాలను వెటకారం చేస్తూ మాట్లాడుతున్నారని వంగవీటి రాధా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

Tags

Next Story