జగన్ ఆస్తుల కేసు ఫిబ్రవరి7కు వాయిదా

జగన్ ఆస్తుల కేసు ఫిబ్రవరి7కు వాయిదా

జగన్‌ ఆస్తుల కేసు ఫిబ్రవరి ఏడుకు వాయిదా పడింది. ఇవాళ కూడా సీబీఐ కోర్టుకు సీఎం జగన్‌ హాజరుకాలేదు. హైకోర్టులో అబ్సెన్స్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున.. తాను నేటి విచారణకు హాజరుకాలేనని కోర్టుకు తెలిపారు. దీంతో విచారణను ఫిబ్రవరి ఏడుకు వాయిదా వేసింది కోర్టు. సీబీఐ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ.. ఆయన ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు.. కౌంటర్‌ దాఖలు చేయడానికి ఫిబ్రవరి ఆరు వరకు సీబీఐకు అవకాశం ఇచ్చింది. దీంతో సీబీఐ కోర్టులో ఆయన ఊరట దక్కింది. అందుకే ఆయన ఇవాళ కోర్టుకు హాజరకాలేదు. సీఎం అయ్యాక జగన్‌ ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే కోర్టుకు హాజరయ్యారు.

Tags

Next Story