కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: నక్కా ఆనందబాబు

కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: నక్కా ఆనందబాబు

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ గుంటూరు జిల్లా కార్యాలయం ఎదుట రైతులు దీక్షకు దిగారు. కలెక్టరేట్‌ ముందు దీక్ష చేస్తున్న రైతులకు మద్దతుగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఇతర నేతలు దీక్షలో కూర్చొన్నారు. సీఎంతో సహా, ఇతర మంత్రులు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్‌ అంటూ ప్రజలు 150 సీట్లలో గెలిపిస్తే.. మతాలు, కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.

Tags

Next Story