ఆంధ్రప్రదేశ్

ఎవడబ్బ సొమ్మని ఇష్టమైనన్ని రాజధానులు నిర్మిస్తారు: చంద్రబాబు

ఎవడబ్బ సొమ్మని ఇష్టమైనన్ని రాజధానులు నిర్మిస్తారు: చంద్రబాబు
X

ఇష్టమైనన్ని రాజధానులు పెట్టుకోవడానికి ఎవడబ్బ సొమ్మూ కాదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్‌ ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు.. 50రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు. రాజధానిని మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉందని కేంద్రం ఎక్కడా చెప్ప లేదన్నారు. హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించాలనుకోవడం తప్పా అని ప్రశ్నించారు. రైతుల తరపున ప్రశ్నించిన పాపానికి తనను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని.. ప్రజల కోసమే వారి తిట్లన్నీ తాను భరిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. తుగ్లక్‌ పోతూ పోతూ జగన్‌ను పుట్టించారంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Next Story

RELATED STORIES