మిలీనియం టవర్స్‌లో 17వేల మంది ఉద్యోగులను ఖాళీ చేయించడం దుర్మార్గం: దేవినేని ఉమా

మిలీనియం టవర్స్‌లో 17వేల మంది ఉద్యోగులను ఖాళీ చేయించడం దుర్మార్గం: దేవినేని ఉమా

రాష్ట్ర ప్రభుత్వం తీరుతోనే పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆరోపించారు మాజీ మంత్రి దేవినేని ఉమ. సీఎం సహా, మంత్రుల తీరు ఇలానే ఉంటే భవిష్యత్తులో రాష్ట్రానికి పెట్టుబడులు రావని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలోని మిలీనియం టవర్స్‌లో 17 వేల మంది ఉద్యోగాలు చేస్తుంటే.. వారిని ఖాళీ చేయించడం దుర్మార్గమన్నారు. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అసభ్యపదజాలంతో చంద్రబాబును తిడుతున్నారని.. ఇలాంటి వారికి ప్రజలే సరైన బుద్ధి చెబుతారని దేవినేని ఉమా అన్నారు.

Tags

Next Story