కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్‌పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి

కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్‌పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి

పాత కక్షల నేపథ్యంలో కాంగ్రెస్‌పార్టీ కౌన్సిలర్‌ సునీల్‌పై టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నాయకులు,కార్యకర్తలు దాడి చేసిన ఘటన హైదరాబాద్‌ వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కమ్మగూడలో జరిగింది. కాంగ్రెస్‌ చేతిలో ఓడిపోయిన టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి పోలిశెట్టి ప్రేమ్‌కుమార్‌ వర్గీయులే దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎన్నికలు ముగిసిన్పటి నుంచి ఇరు వర్గాల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వనస్థలిపురం పోలీస్‌ స్టేసన్‌లో కేసులు కూడ నమోదయ్యాయి. తుర్కంజల్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు.. ఇంబ్రహీంపట్నం ఎమ్మెల్యే అండదండలు చూసుకుని రెచ్చిపోతున్నారని కాంగ్రెస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story