నన్ను కాపాడండి: చైనాలో చిక్కుకున్న తెలుగు యువతి
చైనాలో చిక్కుకున్న కర్నూలు యువతి జ్యోతి మరోసారి తన ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో పెట్టింది. తనకు ఇప్పటి వరకు ఎలాంటి వైరస్ కనిపించ లేదని.. అయినా ఎందుకు నిర్బంధించారో తెలియడం లేదని భయపడుతోంది. తనకు చైనా అధికారులు ఎలాంటి పరీక్షలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని వీడియోలో వివరించింది. ఈ నెల 19న తన వీసా ఎక్స్‌పైర్ అవుతుందని.. ఇప్పటికైనా భారత ప్రభుత్వం.. చైనా ప్రభుత్వంతో మాట్లాడి తనను భారత్‌కు పంపిచే ఏర్పాటు చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది.
మరోవైపు తమ కూతురు క్షేమం కోరుతూ జ్యోతి తల్లి కర్నూలు ప్రత్యేక పూజలు చేయించారు. వుహూన్‌లో చిక్కుకున్న జ్యోతి స్వదేశానికి క్షేమంగా తిరిగి రావాలని ఆమె తల్లి ప్రమీల దేవీ, జ్యోతికి కాబోయే భర్త అమర్‌నాథ్ రెడ్డిలు మహానంది క్షేత్రంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. తరువాత శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి వారి కళ్యాణం జరిపించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com