తప్పు చేస్తే శిక్షించండి.. రాజకీయ కక్షతో వ్యవహరించడం సరికాదు: చంద్రబాబు

తప్పు చేస్తే శిక్షించండి.. రాజకీయ కక్షతో వ్యవహరించడం సరికాదు: చంద్రబాబు

నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తుమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. విజయవాడలోని హెల్ప్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను చంద్రబాబు పరామర్శించారు. యూనివర్సిటీ వీసీ ప్రవర్తన దారుణంగా ఉందన్నారు. యూనివర్సిటీలో 3 రాజధానులపై పెట్టిన చర్చలో విద్యార్థులు తమ అభిప్రాయాలు చెబితే దాడులు చేయిస్తారా అని చంద్రబాబు నిలదీశారు. మహిళా, ప్రజా సంఘాలు, టీడీపీ నిజ నిర్థరణ కమిటీని లోపలికి రానీయకుండా అడ్డుకున్నారని బాబు అన్నారు. జగన్‌ కరుడు గట్టిన నేరస్థుడని.. అందుకే యూనివర్సిటీలో పాలాభిషేకం చేశారా అని ప్రశ్నించారు. వీసీకి చేతనైతే.. జగన్‌ చేత రాజధానిపై ప్రకటన చేయించాలన్నారు.

మరోవైపు సీనియర్‌ IPS అధికారి వెంకటేశ్వరరావుపై కక్ష సాధింపు చర్యల్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. టీడీపీ హయాంలో మెరిట్ ప్రకారమే పోస్టింగ్‌లు ఇచ్చామన్నారు. ముఖ్య మంత్రి చెప్పిన పని మాత్రమే అధికారులు చేస్తున్నారని బాబు తెలిపారు. ఇంతటి దుర్మార్గమైన పాలన దేశంలో ఎక్కడా చూడలేదని బాబు ఘాటుగా విమర్శించారు. అర్థరాత్రి జీవోలపై సీఎస్‌, డీజీ ఆగమేఘాలపై పనిచేస్తున్నారని బాబు అన్నారు. భయపెట్టాలని చూస్తే మేము భయపడం.. ఎంతవరకైనా పోరాటం చేస్తామని బాబు హెచ్చరించారు. తప్పు చేస్తే శిక్షించాలి కానీ.. రాజకీయ కక్షతో వ్యవహరించడం సరికాదన్నారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story