జగన్‌కు పిచ్చి ముదిరి పాకాన పడింది: గద్దే రామ్మోహన్

జగన్‌కు పిచ్చి ముదిరి పాకాన పడింది: గద్దే రామ్మోహన్

పెన్షన్ల తొలగింపుపై విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పటమట సర్కిల్‌-3 కార్యాలయం వద్ద ఎత్త ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ధర్నాలో వృద్ధులు, మహిళలు పాల్గొన్నారు. సీఎం జగన్ ప్రజలపై కక్షసాధిస్తున్నారన్న గద్దె రామ్మోహన్.. వృద్ధులు, వికలాంగులు, వితంతు పెన్షన్లు తొలగించడం ఏంటని ప్రశ్నించారు. జగన్ పిచ్చి ముదిరి పాకాన పడిందని.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు గద్దె రామ్మోహన్‌.

Tags

Next Story