ఆంధ్రప్రదేశ్

చైనాలో చిక్కుకున్న తమ కుమార్తెను స్వదేశానికి రప్పించాలని కేంద్ర పెద్దలను కోరుతున్న జ్యోతి తల్లిదండ్రులు

చైనాలో చిక్కుకున్న తమ కుమార్తెను స్వదేశానికి రప్పించాలని కేంద్ర పెద్దలను కోరుతున్న జ్యోతి తల్లిదండ్రులు
X

వుహాన్‌లో చిక్కుకున్న తెలుగమ్మాయి జ్యోతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డిని కలిసిన జ్యోతి కుటుంబ సభ్యులు.. తమ కూతురును తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేయాలని కోరారు. ఈ మధ్యాహ్నం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ను కూడా కలవనున్నారు. ఢిల్లీలో హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ద్వారా కేంద్రమంత్రులను కలిసేందుకు యత్నం చేస్తున్నారు జ్యోతి కుటుంబ సభ్యులు. ఈ నెల 14న జ్యోతి వివాహం ఉండడంతో వీలైనంత త్వరగా తమ కుమార్తెను స్వస్థలానికి రప్పించే చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. భారత్‌-చైనా మధ్య విమాన రాకపోకలు పూర్తిగా నిలిపివేయడంతో స్వదేశానికి రాలేని దీన స్థితిలో ఉంది జ్యోతి. దీంతో కనీసం చైనాలోని మరో సురక్షిత నగరానికైనా తరలించాలని ఆమె విజ్ఞప్తి చేస్తోంది.

Next Story

RELATED STORIES