ఆంధ్రప్రదేశ్

8 బడ్జెట్లు.. ఒక్కసారి కూడా న్యాయం జరగలేదు: రామ్మోహన్ నాయుడు

8 బడ్జెట్లు.. ఒక్కసారి కూడా న్యాయం జరగలేదు: రామ్మోహన్ నాయుడు
X

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రతిసారీ అన్యాయమే జరుగుతోందన్నారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. రాష్ట్రవిభజన తర్వాత ఇప్పటి వరకు 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారని.. కానీ ఎందులోనూ సరైన కేటాయింపులు జరగలేదని ఆరోపించారు. విశాఖ రైల్వేజోన్‌పైనా క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించకపోవడంపైనా ప్రశ్నించారు. స్పెషల్ స్టేటస్ సాధిస్తామంటూ వైసీపీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని.. ఇప్పుడు 22 మంది ఎంపీలు గెలిచిన తర్వాత కూడా ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. వైసీపీ ఎంపీల పనితీరుపై ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు ఎంపీ రామ్మోహన్‌ నాయుడు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రానికి చిన్నచూపు తగదన్నారు .

Next Story

RELATED STORIES