కరోనాలా వణికిస్తున్న V.V.N.D. వైరస్

కరోనాలా వణికిస్తున్న V.V.N.D. వైరస్

గోరుచుట్టమీద రోకలిపోటు చందంగా.. అసలే కరోనా వైరస్ ప్రభావంతో కుదేలవుతున్న పౌల్ట్రీ రంగాన్ని.. ఇప్పుడు V.V.N.D. వైరస్ వణికిస్తోంది. ఈ కొత్త వైరస్ దెబ్బకు ఏపీ వ్యాప్తంగా చికెన్ సెంటర్లు మూతపడుతున్నాయి. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చికెన్, మటన్ సెంటర్లను మూసేశారు. V.V.N.D. వైరస్ ప్రభావంతో తణకు, పరిసర ప్రాంతాల్లో భారీస్థాయలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. చనిపోయిన కోళ్లను సంబంధిత యజమానులు రోడ్లపక్కనే పడేసి వెళ్తున్నారు. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇక, వైరస్ ప్రభావంతో పెద్దయెత్తున కోళ్లు చనిపోతుండటంతో.. ప్రజారోగ్యం దృష్ట్యా చికెన్, మటన్ దుకాణాలను ప్రభుత్వం మూసివేయిస్తోంది. చికెన్, మటన్ షాపులు వారం రోజులపాటు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని.. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర్ రావు పురపాలక, మండల అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు.. మాంసాహార దుకాణాలను మూసివేయించారు అధికారులు. దుకాణాలు మూసివేయడంతో మాంసాహార ప్రియులు విలవిల్లాడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story