9 నెలల నుంచి వాళ్లకు జీతాలు ఇవ్వడం లేదు: చంద్రబాబు

9 నెలల నుంచి వాళ్లకు జీతాలు ఇవ్వడం లేదు: చంద్రబాబు

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ప్రజా చైతన్య యాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధం అవుతున్నారు. ఈనెల 19న ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి యాత్రను ప్రారంభించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పంచాయతీ రాజ్‌ ను నిర్వీర్యం చేస్తూ కొత్త చట్టాలను రూపొందిస్తున్నారని విమర్శించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఈ 9 నెలల కాలంలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరలేదని చంద్రబాబు విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎటువంటి కోర్టు ఆక్షేపణలు లేవని గుర్తు చేశారు. కేసులు పెడతారని ప్రజలతో పాటు వ్యాపారస్తులు భయపడుతున్నారని పేర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 200 మంది పోలీసులకు 9 నెలల నుంచి జీతాలు ఇవ్వడంలేదని దుయ్యబట్టారు. సీనియర్ అధికారులను సస్పెండ్ చేస్తున్నా.. పోలీసు అసోసియేషన్ ఎందుకు స్పందించడంలేదని చంద్రబాబు ప్రశ్నించారు .

Tags

Read MoreRead Less
Next Story