ఆంధ్రప్రదేశ్

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు.. ఎప్పుడంటే..

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు.. ఎప్పుడంటే..
X

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు 2018-19లో మంజూరు చేసిన మొత్తం ప్రాజెక్టుల్లో అత్యధిక పెట్టుబడులను దక్కించుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 11.8 శాతం పెట్టుబడులను ఆకర్షించి దేశంలోనే అగ్రస్థానాన్ని సంపాదించింది. గత ఐదేళ్లలో చూస్తే.. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు మంజూరు చేసిన ప్రాజెక్టుల్లో ఏపీ 10 శాతం వాటా దక్కించుకొని మూడో స్థానంలో నిలిచింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ ఈ ఘనత సాధించింది.

2014-15 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరాల మధ్యలో దేశవ్యాప్తంగా 7 లక్షల 3 వేల 103 కోట్ల విలువైన 2 వేల112 ప్రాజెక్టులు మంజూరయ్యాయి. అందులో 70 వేల కోట్ల విలువైన పెట్టుబడులు ఏపీకి వచ్చినట్లు రిజర్వు బ్యాంకు ఈ నెల బులిటెన్‌లో వెల్లడించింది. ఐదేళ్ల కాలానికి 13.6 శాతం వాటాతో మహారాష్ట్ర తొలిస్థానాన్ని.. 13.4 శాతం వాటాతో గుజరాత్‌ రెండో స్థానాన్ని చేజిక్కించుకున్నాయి. తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్‌లాంటి రాష్ట్రాలను కాదని కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ 10శాతంతో మూడో స్థానాన్ని ఆక్రమించడం విశేషం.

Next Story

RELATED STORIES