ఆంధ్రప్రదేశ్

జీవోలన్ని అర్థరాత్రి ఎందుకు జారీ చేస్తున్నారు: BJYM రాష్ట్ర అధ్యక్షులు రమేష్‌ నాయుడు

జీవోలన్ని అర్థరాత్రి ఎందుకు జారీ చేస్తున్నారు: BJYM రాష్ట్ర అధ్యక్షులు రమేష్‌ నాయుడు
X

ఏపీలో జగన్ ప్రభుత్వం ముఖ్యమైన జీవోలను అర్ధరాత్రే ఎందుకు జారీ చేస్తోందంటూ BJYM రాష్ట్ర అధ్యక్షులు రమేష్‌ నాయుడు ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పారదర్శక పాలన అందిస్తామని చెప్పి.. ఇప్పుడు అర్థరాత్రి జీవోలు ఎందుకు విడుదల చేస్తున్నారని ఆయన నిలదీశారు. ముందుకువెళ్తే పడిపోతామేమో అనే భావనతో సీఎం జగన్‌ వెనక్కు వెళ్తున్నారని ఆరోపించారు. ఒకప్పుడు పెట్టుబడులకు స్వర్గధామంగా కనిపించిన రాష్ట్రం ఇప్పుడు అవినీతికి చిరునామాగా మారిందన్నారు. పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు లేక ఇక్కడి ప్రజలు వలస వెళ్దామన్నా అక్కడి ప్రజలు రానివ్వడం లేదన్నారు.

Next Story

RELATED STORIES