ఇది జగన్ సొంతింటి వ్యవహారం కాదు.. బయటపెట్టండి: కనకమేడల

ఇది జగన్ సొంతింటి వ్యవహారం కాదు.. బయటపెట్టండి: కనకమేడల

వైసీపీ ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటామాడుతోందని విమర్శించారు టీడీపీ ఎంపీ కనకమేడల. ఢిల్లీ పర్యటనతో జగన్‌ కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. ఢిల్లీకి జగన్‌ వెళ్లారా లేక వాళ్లే పిలిపించారా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు జగన్‌ 9 సార్లు ఢిల్లీ పర్యటన చేశారని.. కానీ ఎందుకు వెళ్లారో ఒక్కసారి కూడా ప్రెస్‌ మీట్‌ పెట్టి ప్రజలకు వివరణ ఇవ్వలేదన్నారు. ఇదేం జగన్‌ సొంతింటి వ్యవహారం కాదన్నారు కనకమేడల.

Tags

Next Story