అసెంబ్లీ సాక్షిగా జగనే ఒప్పుకున్నారు: లోకేష్

అసెంబ్లీ సాక్షిగా జగనే ఒప్పుకున్నారు: లోకేష్

చంద్రబాబు హయాంలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదు అంటూ అసత్య ప్రచారం చేసిన జగన్‌.. ఇప్పుడు వాస్తవాలు బయట పెడుతున్నారని లోకేష్‌ ట్వీట్‌ చేశారు. చంద్రబాబు హయాంలో రాష్ట్ర యువతకి 9 లక్షల 56 వేల 263 ఉద్యోగాలు వచ్చాయని అసెంబ్లీ సాక్షిగా సీఎం జగనే‌ చెప్పారని గుర్తు చేశారు. పరిశ్రమల ద్వారా 5 లక్షల 13 వేల 351 ఉద్యోగాలు, ఐటీ శాఖ ద్వారా 30 వేల428 ఉద్యోగాలు, అడ్వాన్స్‌ స్టేజ్‌లో ఉన్న 137 కంపెనీల ద్వారా 2 లక్షల 78 వేల 586 ఉద్యోగాలు వచ్చాయని స్వయంగా ప్రభుత్వమే చెప్పిందన్నారు. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వం ఇస్తున్నట్టు దొడ్డిదారిన వచ్చిన ఉద్యోగాలు కాదని.. నిరుద్యోగ యువతకి చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాలు అంటూ లోకేష్‌ ట్వీట్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story