సీఎం పుట్టినరోజు.. వుయ్ లవ్ కేసీఆర్ లోగో..

సీఎం పుట్టినరోజు.. వుయ్ లవ్ కేసీఆర్ లోగో..

తెలంగాణ సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలకు టిఆర్‌ఎస్‌ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని జలవిహార్‌లో వుయ్‌ లవ్‌ కేసీఆర్‌ లోగోని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆవిష్కరించారు. సోమవారం జలవిహార్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకల ఏర్పాట్లను మంత్రి పరీశీలించారు.

కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఉదయం బల్కంపేట ఎల్లమ్మ గుడి దగ్గర మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. జలవిహార్ లో కూడా హరితహారం, హెల్త్ క్యాంప్, ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయనున్నారు. భారీ కేక్‌ కూడా నక్లెస్‌ రోడ్డులోనే కట్‌ చేస్తామన్నారు.

కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. మంత్రులు, ఎంపీలు, గ్రేటర్ ఎమ్మెల్యేలు అంతా ఈ జన్మదిన వేడుకల్లో పాల్గోనున్నారు. గ్రేటర్ వాసులు సైతం కేసీఆర్ జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని మంత్రి తలసాని పిలుపు ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story