ప్రాంతాల మధ్య జగన్ చిచ్చుపెడుతున్నారు: ఏపీ కాంగ్రెస్ చీఫ్ శైలజానాథ్

ప్రాంతాల మధ్య జగన్ చిచ్చుపెడుతున్నారు: ఏపీ కాంగ్రెస్ చీఫ్ శైలజానాథ్

ఢిల్లీ పర్యటన ద్వారా ముఖ్యమంత్రి జగన్ ఏం సాధించారో చెప్పాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ శైలజానాథ్ డిమాండ్ చేశారు. 3 రాజధానులకు కాంగ్రెస్ వ్యతిరేకమని స్పష్టం చేశారు. అభివృద్ధికి రాజధానులకు ముడిపెట్టొద్దని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. రాజధాని విషయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత శైలజానాథ్ తొలిసారి విశాఖలో పర్యటించారు.

రాజధాని మార్పు తుగ్లక్ చర్యగా అభివర్ణించారు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. ఈ నిర్ణయం వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని ఆరోపించారు. ఎవరైనా విశాఖలో రాజధాని పెట్టాలని అడిగారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ విభజన హామీలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు తులసిరెడ్డి.. అమరావతిని కాపాడాలంటూ శక్తి ప్రతినిధులు ఆయనకు వినతిపత్రం అందించారు.

Tags

Next Story