నువ్వా.. నేనా.. అనుకునే వరకు టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వివాదం.. సభలోనే..

నువ్వా.. నేనా.. అనుకునే వరకు టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వివాదం.. సభలోనే..

నల్గొండ జిల్లా మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ సమ్మేళనం సభలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. TRS ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. TRS హయాంలో అభివృద్ధి పడకేసిందన్నారు రాజగోపాల్‌రెడ్డి. ప్రతిపక్షాల కళ్లకు పొరలు కమ్ముకున్నాయంటూ కౌంటర్ ఇచ్చారు కంచర్ల. మాటామాటా పెరిగి వాగ్వాదం తారస్థాయికి వెళ్లింది.. ఒక దశలో ఒకరిమీదకు మరొకరు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వేదికపైనున్న నాయకులు ఇద్దరిని అడ్డుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story