తూర్పుగోదావరి జిల్లాలోని వైసీపీలో బయటపడ్డ వర్గపోరు

తూర్పుగోదావరి జిల్లాలోని వైసీపీలో బయటపడ్డ వర్గపోరు

తూర్పు గోదావరి జిల్లా వైసీపీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి స్వాగతం పలికేందుకు... ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వర్గాలు పోటీ పడ్డాయి. ఇరువర్గాల మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది. తోట త్రిమూర్తులుకు వ్యతిరేకంగా వేణు వర్గం పెద్దపెట్టున నినాదాలు చేసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. తోట త్రిమూర్తులుపై దాడి చేసి కొట్టామంటూ వేణువర్గం నాయకులు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనిపై త్రిమూర్తులు వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Tags

Next Story