అన్ని ధరలు పెంచి.. ప్రజల రక్తం పీలుస్తున్నారు: కన్నా లక్ష్మీనారాయణ
రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై అకారణంగా కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. విజయవాడ బీజేపీ పదాధికారుల సమావేశంలో కన్నా ప్రసంగించారు. గిరిజనులపైనా అట్రాసిటీ కేసులు పెడుతున్నారన్నారు. డీజీపీకి ఫిర్యాదు చేసిన కేసులు ఆగడం లేదన్నారాయన. దేవాలయాలపై దాడులకు ప్రభుత్వం అండగా ఉన్నట్లు తెలుస్తోందనన్నారు. ప్రభుత్వ అండతోనే దాడులు చేస్తున్నారన్నారు. అన్ని ధరల పెంచి ప్రజల రక్త పీలుస్తున్నారంటూ వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామన్నారు కన్నా.
పదాదికారుల సమావేశంలో.. కేంద్ర వార్షిక బడ్జెట్‌ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే అంశంపై చర్చ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల కార్యచరణ, అమరావతి రాజధానిపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి ఎంపీ జీవీఎల్, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి, ఎమ్మెల్సీలు సోమువీర్రాజు, మాధవ్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com