ప్రకటించిన ఆస్తుల కంటే ఒక్క రూపాయి అదనంగా ఉన్నా.. నిరూపించాలి: లోకేష్

ప్రకటించిన ఆస్తుల కంటే ఒక్క రూపాయి అదనంగా ఉన్నా.. నిరూపించాలి: లోకేష్

9 ఏళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్న ఏకైక రాజకీయ కుటుంబం తమదని అన్నారు నారా లోకేష్. ప్రకటించిన ఆస్తుల కంటే ఒక్క రూపాయి అదనంగా ఉన్నా నిరూపించాలంటూ సవాల్ విసిరారు. వైసీపీ చేసిన తప్పుడు ఆరోపణలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ధైర్యం ఉంటే వాళ్ల ఆస్తులు ప్రకటించాలని అన్నారు. తమ కుటుంబ సభ్యులు ఎవరికీ APలో ఆస్తుల్లేవని.. హెరిటేజ్ ఫుడ్స్‌కు మాత్రం ఆస్తులు, ప్రాజెక్ట్ లు ఉన్నాయని చెప్పారు నారా లోకేష్.

జగన్ ఆస్తులను ED, CBI ఇవ్వడం కాకుండా ఆయనే ప్రకటించాలని ఎద్దేవా చేశారు నారా లోకేష్. 2004లో 9లక్షలుగా ఉన్న జగన్ ఆదాయం ఇప్పుడు 42 వేల కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు.

Tags

Next Story