సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు పరిధి దాటి మాట్లాడుతున్నారు: టీడీపీ ఎమ్మెల్సీ

X
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకుల తీరుపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఫైరయ్యారు. సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు పరిధి దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శాసనమండలి వ్యవహారాలు, ఎమ్మెల్సీల విషయంలో జోక్యం చేసుకుంటే సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలి నిబంధనల విషయంలో ఛైర్మన్, కార్యదర్శి మధ్య సాగుతున్న వివాదంతో ఉద్యగ సంఘం నాయకులకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిపై భక్తి చూపించాలనుకుంటే ఆయన ఇంటి ముందు భజన చేసుకోవాలని సెటైర్లు వేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
