ఎన్నికల్లో ఓట్లు తెలుగులో ఎందుకు అడిగారు: తెలుగు భాషాభిమానులు

ఎన్నికల్లో ఓట్లు తెలుగులో ఎందుకు అడిగారు: తెలుగు భాషాభిమానులు

తాను పట్టిన కుందేలుకి మూడేకాళ్లు అన్న చందగా జగన్‌ వ్యవహరిస్తున్నారంటూ తెలుగు భాషాభిమానులు మండిపడుతున్నారు. తల్లిలాంటి తెలుగు భాషను తొక్కేస్తున్న జగన్‌.. ఎన్నికల్లో మాత్రం తెలుగులో ఓట్లు ఎందుకడిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లీషు వారు తెచ్చిన మతాన్ని.. భాషను మనపై రుద్దడమే జగన్‌ లక్ష్యంగా కనిపిస్తోంది అన్నారు. ప్రాధమిక విద్య మాతృ భాషలోనే ఉండాలని నిపుణులు చెబుతున్నా.. జగన్‌ మనసు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం వేళ విశాఖలోని మద్దిలపాలెం జంక్షన్‌లో సమావేశమై.. తెలుగు తల్లి విగ్రహానికి నివాళులర్పించారు.

Tags

Next Story