సీఎంతో మాట్లాడడానికే వైసీపీ నాయకులు భయపడుతున్నారు: అశోక్ గజపతిరాజు

సీఎంతో మాట్లాడడానికే వైసీపీ నాయకులు భయపడుతున్నారు: అశోక్ గజపతిరాజు

ప్రస్తుత ప్రభుత్వంలో కార్యకర్తలు, నాయకులు జగన్మోహన్ రెడ్డి తో మాట్లాడడానికే భయపడుతున్నారని అన్నారు కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతి రాజు. ప్రభుత్వం చేస్తున్న పనులు మీద ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ప్రత్యేక హోదా మీద ఆనాడు గోల గోల చేసి.. టీడీపీ మీద అనేక విమర్సలు చేసి.. ఈనాడు తప్పించుకొని తిరుగుతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలు వినడానికి కూడా ప్రభుత్వానికి సమయం లేదని ఎద్దేవా చేశారు. వారి బాధలు తెలుసుకోవడానికి, వారికి భరోసా ఇవ్వడానికే చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్ర చేపడుతున్నారని తెలిపారు.

Tags

Next Story