తుగ్లక్ సమేత.. వైకాపా పరివారం: నారా లోకేష్
తుగ్లక్ సమేత వైకాపా పరివారమంటూ.. జగన్ ప్రభుత్వాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విట్టర్‌లో ఏకిపారేశారు. 9 నెలల నుండి తుగ్లక్ సమేత వైకాపా పరివారం.. గో బ్యాక్ అంటూనే ఉన్నారని ట్వీట్ చేశారు. అందుకే ఉత్తరాంధ్ర, రాయలసీమకి రావాల్సిన కంపెనీలు అన్ని వెళ్లిపోయాయన్నారు. విశాఖ ప్రమాదకరమైన ప్రాంతం అంటూ.. జీఎన్‌రావ్ కమిటీతో రిపోర్ట్ రాయించి ఉత్తరాంధ్ర యువతకి రావాల్సిన ఉద్యోగాలను గో బ్యాక్ అని తరిమేశారని ట్వీట్ చేశారు లోకేష్.
హుద్ హుద్, తిత్లీ వచ్చినపుడు మంచినీళ్లు ఇవ్వడానికి కూడా రాని వ్యక్తి ఇప్పుడు ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తారా అంటూ ప్రశ్నించారు. వోక్స్ వ్యాగన్ సొమ్ముల్లానే హుద్ హుద్ సమయంలో సహాయం కోసం జగన్ గారు ఇచ్చాను అంటున్న 50 లక్షలు పోనాయి ఏటి సేత్తాం అంటూ సెటైరిక్‌గా ట్వీట్ చేశారు. దోపిడీ ప్రణాళిక తప్ప, అభివృద్ధి ప్రణాళిక లేకుండా చెత్త కమిటీలతో ఉత్తరాంధ్రకి వ్యతిరేకంగా రిపోర్టులు రాయించి చావు దెబ్బ కొట్టిన జగన్ గారిని.. గో బ్యాక్ అంటేనే ఉత్తరాంధ్ర బాగుపడుతుందని లోకేష్ ట్వీట్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com