టీడీపీ ఇలా చేసి ఉంటే.. జగన్ పాదయాత్ర చేసేవారా: యనమల

టీడీపీ ఇలా చేసి ఉంటే.. జగన్ పాదయాత్ర చేసేవారా: యనమల

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న ప్రజాచైతన్య యాత్రను వైసీపీ వర్గాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. విశాఖలో జగన్ భూకబ్జాలు బయటకు వస్తాయనే భయంతోనే వైసీపీ.. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటుందని అన్నారు. చంద్రబాబు కాన్వాయ్‌పై వైసీపీ దాడికి పాల్పడడం హేయమైన చర్యని ద్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని ఫ్యాక్షన్ రాజ్యంగా చేస్తారా? మీ అరాచకాల కోసం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తారా అని ప్రశ్నించారు. వైసీపీ నేతల స్వార్ధానికి పోలీసులను వాడుకోవడం దారుణమని.. జగన్‌ది తొలినుంచి ఫ్యాక్షన్ బుద్దేనని.. ఫ్యాక్షన్ బుద్దులున్నవాళ్లు పాలకులైతే ఇలాగే ఉంటుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫ్యాక్షన్ కుటుంబం కాబట్టే ప్రత్యర్ధులపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఇలాగే చేసివుంటే.. 2003లో రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేసేవారా? 2017లో జగన్‌ పాదయాత్ర చేయగలిగేవారా అని ప్రశ్నించారు.

Tags

Next Story