యాత్రకు పర్మిషన్ ఉన్నా.. ఎలా అరెస్ట్ చేస్తారు?: టీడీపీ

యాత్రకు పర్మిషన్ ఉన్నా.. ఎలా అరెస్ట్ చేస్తారు?: టీడీపీ

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ఎయిర్‌పోర్ట్‌లోని వీఐపీ లాంజ్‌లోకి తీసుకెళ్లారు. తిరిగి విజయవాడకు పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే తిరిగి వెళ్లేందుకు చంద్రబాబు ససేమిరా అంటున్నారు. అటు.. పర్మిషన్ ఉన్నా చంద్రబాబును ఎలా అరెస్ట్‌ చేస్తారని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. Z+ కేటగిరీ ఉన్న వ్యక్తిని ఏసీపీ చేతిరాతతో ఉన్న నోటీసిచ్చి ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. CRPC 151 సెక్షన్‌ ప్రకారం ముందస్తు అరెస్టు ఎలా చేస్తారని ఫైరయ్యారు. చంద్రబాబు పేరు కూడా ప్రస్తావించకుండా నోటీసు ఇచ్చారని మండిపడ్డారు. యాత్రకు అనుమతి ఉన్నప్పటికీ ముందస్తు అరెస్టు ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Next Story