వైసీపీ నేతలు విశాఖవాసులను అవమానిస్తున్నారు: యనమల
BY TV5 Telugu29 Feb 2020 1:47 PM GMT

X
TV5 Telugu29 Feb 2020 1:47 PM GMT
వైసీపీ నేతలు విశాఖవాసులను అవమానిస్తున్నారని యనమల మండిపడ్డారు. ప్రజలను రౌడీలు, సంఘ విద్రోహులతో పోల్చుతున్నారని.. వాళ్లే చంద్రబాబుపై కోడిగుడ్లు, టమాటాలు విసిరారంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రౌడీయిజం ప్రేరేపిస్తూ విశాఖ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటోంది వైసీపీ నేతలేనన్నారు. అల్లర్లను ప్రోత్సహించి పెట్టుబడులు రాకుండా చేస్తూ స్థానికుల ఉపాధికి గండి కొడుతున్నారు. 27న జరిగిన ఘటనతో జగన్ క్రూరత్వం బయటపడిందని అన్నారు యనమల.
Next Story