జగన్ మోసపూరిత ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతున్నారు: నక్కా ఆనంద్‌బాబు

జగన్ మోసపూరిత ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతున్నారు: నక్కా ఆనంద్‌బాబు

అమరావతి నుంచి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ.. గుంటూరులో రైతుల నిరహార దీక్షలు 65వ రోజుకు చేరాయి. గత 64 రోజులుగా పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో.. గుంటూరు కలెక్టర్‌ ఎదుట రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం దీక్షలను.. టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. రాజధానిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే వరకు దీక్షలు కొనసాగుతాయన్నారు జేఏసీ నేతలు.

ప్రభుత్వం ప్రజా కంఠక పాలన సాగిస్తూ.. తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు నక్కా ఆనంద్‌బాబు. రాష్ట్రంలో అమరావతి ఉద్యమం ఇప్పటికే 76వరోజుకు చేరింది. అమరావతి మహోద్యమాన్ని సాగిస్తున్న మహిళలు, రైతులుకు ధన్యవాదాలు తెలిపారు. గత 9 నెలలుగా.. సీఎం జగన్‌ మోసపూరిత ప్రకటనలు చేస్తూ.. ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు.

Tags

Next Story