అమరావతి రైతులకు మద్దతుగా తూర్పుగోదావరిలో నిరసనలు

అమరావతి రైతులకు మద్దతుగా తూర్పుగోదావరిలో నిరసనలు

అమరావతి రైతుల పోరాటానికి రాష్ట్రవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతూలపూడి మండలంలో టీడీపీ నేతలు, రైతులు నిరసనకు దిగారు. మండల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట.. ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్‌ వరుపుల రాజా, కార్యకర్తలు, రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మూడు ముక్కల రాజధాని వద్దంటూ వరుపుల రాజా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతులకు అన్యాయం చేయోద్దన్నారు. అనంతరం తహసీల్దార్‌కి వినతి పత్రం అందజేశారు.

Tags

Next Story