ఆంధ్రప్రదేశ్

మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ

మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ
X

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ సీరియస్ గా చర్చించింది. అన్ని స్థానాలను గెలిపించాల్సిన బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలదే అన్నారు సీఎం జగన్. సరైన రీతిలో వ్యవహరించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు రాకపోతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కవని తేల్చిచెప్పారు. అంతేకాకుండా.. నియోజకర్గాల్లో మంచి ఫలితాలు రాకపోతే.. మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సివుంటుందని మంత్రులను హెచ్చరించినట్టు సమాచారం. 40 నిమిషాల పాటు స్థానిక సంస్థలపైనే చర్చించిన సీఎం జగన్.. అన్ని స్థానాలను వైసీపీ దక్కించుకునేలా కృషి చేయాలని మంత్రులను ఆదేశించారు.

కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇళ్ల స్థలాల పంపిణీపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఉగాదిలోగా 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. పేదలకు ఇచ్చే కాలనీలకు వైఎస్సార్ కాలనీలుగా నామకరణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక 2010లో వున్న ప్రశ్నలకు పరిమతమవుతూ.. NPRలో మార్పులు కోరుతూ కేబినెట్ తీర్మానం చేసింది. మార్పులు చేసేవరకు NPR ప్రక్రియను రాష్ట్రంలో నిలిపివేయాలని నిర్ణయించారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు కేటాయించిన భూమిని 27 వేల ఎకరాల నుంచి 22 వేల ఎకరాలకు కుదించారు.

కేబినెట్ నిర్ణయాలను వివరించిన మంత్రి పేర్ని నాని ప్రతిపక్ష టీడీపీపై మండిపడ్డారు. బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు.. బీసీలకు ఎన్ని టిక్కెట్లు ఇచ్చారని ప్రశ్నించారు. ఐదేళ్ల పాలనలో మైనార్టీలకు, గిరిజనులకు మంత్రి పదవులు ఇవ్వలేదని.. అధికారం కోల్పోయాక బీసీలపై ప్రేమ కురిపిస్తున్నారని అన్నారు.

Next Story

RELATED STORIES