నిజామాబాద్‌లో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు?

నిజామాబాద్‌లో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ తెలంగాణను తాకింది. హైదరాబాద్‌లో తొలి పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అటు నిజామాబాద్‌ జిల్లాలో కూడా కరోనా వైరస్‌ కలకలం రేపింది. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండడంతో అతడ్ని హైదరాబాద్‌కు తరలించారు. మరోవైపు జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన నోడల్‌ టీంను నియమించారు.

Tags

Read MoreRead Less
Next Story